సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత


విశాలాంధ్ర.రాజాం, విజయనగరం జిల్లా -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతకవిటి మండలానికి డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను బుధవారం అందజేశారు. సుమారు రూ.75 వేల విలువ కలిగిన ఈ ఫ్రీజర్ బాక్స్‌ను మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మానవత చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, అవసర సమయంలో పేదలకు మరియు సాధారణ ప్రజలకు ఈ ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మానవత సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మానవత కార్యదర్శి ఉల్లాకుల నీలకంటేశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షులు గట్టి పాపారావు, సభ్యులు కొల్లూరు వెంకట్ నాగేశ్వరరావు, పండూరి వేణుగోపాల్, బొత్స జానకిరామ్, శాసపు సత్యనారాయణ, పెంకి చైతన్యకుమార్, శిమకుర్తి ప్రసాద్, కొల్ల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *