Last Updated:
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాకాస ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధం.
ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తుండగా, మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖపట్నంలోని దసపల్ల హోటల్లో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కమిటీ కుర్రాళ్లు విజయానంతరం మరో వినూత్నమైన ఫాంటసీ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. విశాఖ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి ఎనర్జీ ఈ సినిమా ప్రమోషన్‌కు మంచి స్టార్ట్ ఇచ్చిందని చెప్పారు.
హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ, ‘రాకాస’ ఒక కొత్త తరహా ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ అని తెలిపారు. హారర్, కామెడీ మేళవింపుతో పాటు ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఇందులో ఉంటుందని చెప్పారు. దర్శకుడు విఠలాచార్య స్టైల్లో చందమామ కథల మాదిరి ఫీల్ ఈ సినిమాలో కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా రూపొందిందని నమ్మకం వ్యక్తం చేశారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ, ఈ సినిమా ప్రమోషన్స్‌ను విశాఖలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ తనకు ప్రత్యేకమైన నగరమని, ఈ సినిమాలో ఉన్న కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ తెరకెక్కిందని తెలిపారు.
నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఈ సినిమాలో ఫాంటసీ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందన్నారు. సంగీత్ శోభన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడి పని చేసిందని చెప్పారు. సీనియర్ నటులు బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి వారి పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. మొత్తంగా ‘రాకాస’ ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Mar 22, 2026 10:18 PM IST



