సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ లిమిటెడ్ చైర్‌పర్సన్ టి. నిర్మల జగ్గారెడ్డి ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు సిరాజ్ పీకే, హెడ్రిటైల్ ఆపరేషన్స్ (రెస్ట్ ఆఫ్ ఇండియా), షానిబ్ కే, జోనల్ హెడ్ తెలంగాణ, ముహమ్మద్ షరీజ్ కే, జోనల్ హెడ్ ` హైదరాబాద్, అసిస్టెంట్ షోరూమ్ హెడ్ ఇంజిఫ్ అబ్దిల్లా పాల్గొన్నారు.
The post సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం appeared first on Visalaandhra.


