శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. |


Last Updated:

జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేయాలని సూచించింది

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు..

శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ముందుగానే ప్రణాళికలు చేసుకునేలా తేదీల వారీగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ డ్రా నమోదు ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. డ్రాలో ఎంపికైన వారు ఏప్రిల్ 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తేనే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.

అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లు ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుండగా, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు విడుదల కానుండగా, తిరుమల, తిరుపతిలో గదుల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. అన్ని బుకింగ్స్‌ను భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ముందుగా తేదీలను గమనించి ప్లాన్ చేసుకుంటే శ్రీవారి దర్శనం సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *