కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదు
శుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదు
అధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ
తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించేంత వరకు శాంతికి ఆస్కారం ఉండదని ఖామేనీ చెప్పారన్నారు. ఇజ్రాయిల్అమెరికా మోకరిల్లేలా చేద్దామని ఆయన అన్నట్లు అధికారి చెప్పారు. అయితే అధినేతగా పగ్గాలు చేపట్టిన తర్వాత ముజ్తబా ఖామేనీ తమ విదేశాంగ విధానంపై తొలి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేస్తుండటం విదితమే. నష్ట పరిహారం చెల్లించని పక్షంలో శుత్రు దేశాల ఆస్తులు జప్తు చేస్తామని ముజ్తబా తన తొలి సందేశంలో తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇరాన్ వెనక్కి తగ్గదని, శక్తిమేరకు ప్రతిఘటిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, అమరుల త్యాగాలను వధా కానివ్వమని సంకల్పించారు. ఇదిలావుంటే, ఫిబ్రవరి 28న అమెరికాఇజ్రాయిల్ జరిపిన సంయుక్త దాడుల్లో మత్యువు నుంచి రెప్పపాటులో తప్పించుకన్న ముజ్తబా ఖామేనీ రష్యాలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది. చికిత్స కోసం ముజ్తబాను మాస్కోకు తరలించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. రష్యా సైనిక విమానంలో ముజ్తబాను తరలించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో రష్యా అధికారి దిమిత్రీ పెస్కోవ్ స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఈ వార్తను రష్యాకు ఇరాన్ రాయబారి ఖండించారు. ముజ్తబా క్షేమంగా ఇరాన్‌లో ఉన్నారన్నారు. ఇదిలావుంటే, అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడులను తీవ్రంగా ఖండించాలంటూ ఐక్య రాజ్య సమితికి, ప్రపంచ దేశాలకు, ప్రపంచ శాంతిభద్రతా సంస్థలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పిలుపునిచ్చారు. లారిజాని మతి వార్తకు ఇరాన్ ఖండన ఇజ్రాయిల్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. లారిజానీ చేతితో రాసిన ఓ నోట్ ఇరాన్ మీడియా ప్రచురించింది. భారత్‌లో విన్యాసాల నుంచి తిరిగివచ్చే నౌకపై అమెరికా దాడితో అమరులైన 84 మంది నావికులకు అంజలి ఘటించే ఆయన నోట్ సామాజిక మాధ్యమంలో కనిపించింది. ఈ సెయిలర్ల అంత్యక్రియలు మంగళవారం జరిగినట్లు తెలిసింది. కాగా, లారిజానీ ఇరాన్ భద్రత, అణు కార్యక్రమం సహా ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. యుద్ధానికి ముందు ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికాతో అణు చర్చలకు ఆయన నాయకత్వం వహించారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రివల్యూషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఖామేనీ మరణానంతరం ఇరాన్‌లో శక్తిమంతమైన నేతగా ఆయన పేరు వినిపించింది. ఆయాతుల్లా అలీ ఖమేనీ తర్వాత మరణించిన తర్వాత ఇరాన్ ఉన్నత స్థాయి అధికారిగా లారీజాని ఉన్నారు. శుక్రవారం అల్ కుర్ద్స్ ర్యాలీలో పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన ప్రజలకు కనిపించింది అక్కడే. కాగా, ఇరాన్ అధికారిక ప్రెస్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ లారిజాని పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘47 ఏళ్ల కిందట ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో విజయానికి ముందు రోజు వీధుల్లోకి వచ్చిన జనసమూహాలు చేస్తున్న శబ్దం నిజమైంది కాదని, అది ఒక టేప్ రికార్డింగ్ అని పహ్లావి ప్రభుత్వ ప్రధానమంత్రి అన్నారు. ఇరాన్ నగరాల్లో ప్రస్తుతం లక్షలాది మందితో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలను ట్రంప్ ఏఐ ఫోటోలుగా వర్ణిస్తున్నారు. ఎప్‌స్టీన్ ద్వీప అవశేషాలపై ఇరాన్ ప్రజల చారిత్రక విజయం ఆసన్నమైంది’ అని అన్నారు. యుద్ధంలో కొత్త దశ ప్రారంభం: ఐఆర్‌జీసీ అమెరికాఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా సమర్ధభీకర దాడుల కొత్త దశను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్సొ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సర్దార్ మౌసవీ ప్రకటించారు. అహంకారుల వెన్నెమునకు మన వీధుల్లో, కూడుళ్లలో ముక్తలు చేస్తామన్నారు. ప్రాంతీయంగా అమెరికాఇజ్రాయిల్ స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడులను ఐఆర్‌జీసీ కొనసాగిస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ నుంచి మరింతగా క్షిపణులు తమ దేశంపైకి దూసుకొచ్చాయి.
తమ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్ధంగా అడ్డుకున్నదని ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇరాన్ దాడులతో జెరూసలేంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎయిర్ రెయిడ్ సైరన్లు మోగాయి. ఇదిలావుంటే, లెబనాన్‌లో ఇజ్రాయిల్ విధ్వంసం సష్టిస్తుండగా హెజ్బుల్లా ప్రతిఘటిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని ఖియామ్ పట్టణంలోని మున్సిపల్ భవనం వద్ద ఉన్న ఇజ్రాయిల్ సైనికులపై రాకెట్లతో దాడి చేసినట్లు హెజ్బుల్లా ఎక్స్‌లో పేర్కొంది. అలాగే బింత్ జిబ్రెయిల్ జిల్లాలోని మరౌన్ అల్ రస్ అనే సరిహద్దు పట్టణంలో గుడారాల్లో ఉన్న ఇజ్రాయిల్ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు అంతకుముందు వెల్లడించింది.
The post శాంతికి సమయం కాదు appeared first on Visalaandhra.


