వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి


. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్
. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య
. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యల్లమందరావు, తిరుపతిలో ఎ.రామానాయుడు, వి.హనుమారెడ్డి, ఒంగోలులో జాతీయ సమితి సభ్యులు కె. వీరారెడ్డి, అనంతపురంలో రైతుసంఘ రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జున, పల్నాడు జిల్లాలో ఉలవలపూడి రాము తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో పీజీఆరఎస్ కార్యక్రమంలో రైతులతో కల్సి డీఆర్‌వో ఖాజావలికి కేవీవీ ప్రసాద్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వ్యవసాయరంగంపై 62శాతం మంది ఆధారపడి జీవిస్తుండగా, వారి కోసం బడ్జెట్‌లో కేవలం 4.31శాతం నిధులు కేటాయించడం దారుణమని విమర్శించారు. బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలన్నింటికీ కలిపి కేవలం 53,752 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని తెలిపారు. అత్యంత ప్రాధాన్యతా రంగానికి కేవలం 4.31శాతం మాత్రమే కేటాయింపులు చేయడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 50శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నూటికి 62శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడ్డారన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి గతంలో 9,400 కోట్లు ఉండగా, ప్రస్తుతం దానిని 6,660 కోట్లకు తగ్గించారు. వడ్డీరాయితీకి 2,000 కోట్లు అవసరం కాగా కేవలం 250 కోట్లు కేటాయించారు. ధరల స్దీరీకరణ నిధికి 3,000 కోట్లు అవసరమైతే 500 కోట్లు విదిల్చారు. ఉచిత పంటల భీమా, ప్రకతి విపత్తుల సహాయ నిధికి నిధుల కేటాయింపులు లేకపోవడంతో రైతుల్లో అభద్రతా భావం నెలకొంది. రాష్ట్రంలో మెజారిటీ భూములు సాగుచేస్తున్న కౌలు రైతుల గురించి, వారి రక్షణ చట్టం అంశాలు కనీసం ప్రస్తావించకపోవడం తీవ్ర అన్నాయమని నేతలు మండిపడ్డారు. పశు సంవర్థకశాఖ, మత్య్సశాఖ, ఆక్వా కల్చర్, సెరికల్చర్ తదితర ఉపాధినిచ్చే రంగాలకు తగిన ప్రాధాన్యత బడ్జెట్‌లో లోపించిందని విమర్శించారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని, ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ప్రతిపాదనలు పున:పరిశీలన చేసి తగిన విధంగా కేటాయింపులు పెంచాలని కేవీవీ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పి, బడ్జెట్‌లో వారి ఊసే లేకపోవడం దుర్మార్గమన్నారు. బడ్జెట్ అంకెలగారడీ తప్ప, దానిలో పస లేదని, కౌలు రైతుల నడ్డి విరిచారని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కష్ణా జిల్లా చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామారావు, గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి కాట్రగడ్డ రామచంద్రజోషి, సహాయ కార్యదర్శి చాగంటిపాటి వెంకటేశ్వరరావు, గంపలగూడెంలో ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు తూము కష్ణయ్య, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు చిలుకూరి వెంకటేశ్వరరావు, సీపీఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ముసునూరులో ఏలూరు జిల్లా రైతు సంఘం ప్రధానకార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, ఏలూరులో రైతు సంఘ నాయకులు ఉప్పులూరి హేమశంకర్, కురెళ్ళ వర ప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, చింతలపూడిలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దంతా కష్ణ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *