విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ సభ్యులు పోట్ల షఫీ, సూరి, చిట్టి, రియాజ్, వైఎస్ఆర్సిపి నాయకులు, ఫయాజ్ భాష అభిమానులు పాల్గొన్నారు
The post వైసిపి నేత ఇఫ్తార్ విందు.. appeared first on Visalaandhra.


