డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి
విశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు, ఇంటి యందు తయారు చేసుకున్న పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. నిమ్మరసం కళ్ళు తిరగడం లాంటి సమయంలో ఓఆర్ ఎస్ ద్రవాన్ని సేవించాలని, ఓఆర్ఎస్ పాకెట్స్ అంగన్వాడీ కేంద్రములలో ఉచితంగా లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఎండ సమయంలో తలకు టోపీ, గొడుగు లాంటివి , నూలు వస్త్రాలు,తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేసి డిపో మేనేజర్ కు ఓఆర్ఎస్ పాకెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి నగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, ఎంఓ అసిస్టెంట్ అన్న లక్ష్మీనారాయణ, హెల్త్ అసిస్టెంట్ విష్ణువర్ధన్, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


