వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ


విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించి పాఠశాలకు గర్వకారణమని డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్షలునిర్వహించిన మూడు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభ, కృషి, పట్టుదలను చాటుకున్నారు అని తెలిపారు.6వ తరగతి నుండి జతిన్ కుమార్, కె. గగన్ గీత్, నిఖిల్ సాయి , 7వ తరగతి నుండి ఆదిత్య సాయి, హర్షవర్ధన్ నాయక్, మధు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు అని తెలిపారు. మా విద్యార్థులు ప్రతీ పోటీలో ముందుండాలని, వేదిక్ మ్యాథ్స్ ద్వారా గణితంలో మెరుగైన నైపుణ్యాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము అని తెలిపారు.సీఈఓ రవీంద్ర విద్యార్థులను అభినందిస్తూ, “ఇది కేవలం ఆరంభం మాత్రమే అని,. రాష్ట్ర స్థాయిలో కూడా రిషి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆశిస్తున్నాము అన్నారు. ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ విజయం సాధ్యమైందిఅని తెలిపారు. అనంతరంఏ.ఓ. రంగా రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *