. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి..
. గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ..
. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పథకం ప్రచారంలో భాగంగా రూపొందించిన గోడపత్రికలను, కరపత్రాలను సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రచారం చేయడానికి ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ చట్టం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి హామీతో పాటు, శ్రామికుల హక్కులను బలోపేతం చేస్తుందని, ప్రతి అర్హత కుటుంబానికి పథకం చేరేలా అందరూ కృషి చేయాలని తెలిపారు.
వారం వారీ కార్యక్రమాలు1వ వారం (25–28 మార్చి): “అపోహలు Vs వాస్తవాలు” – మీడియా ద్వారా చట్టంపై అవగాహన.
2వ వారం (02–07 ఏప్రిల్): శ్రామికుల హక్కుల పరిరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు.
3వ వారం (09–14 ఏప్రిల్): గ్రామ సభల్లో చట్ట అవగాహన చర్చలు, గోడ రాతలు.
4వ వారం (16–21 ఏప్రిల్): పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు, అవగాహన ర్యాలీలు.
5వ వారం (23–28 ఏప్రిల్): పంచాయతీ రాజ్ ప్రతినిధులతో అవగాహన సమావేశాలు.
6వ వారం (29–30 ఏప్రిల్): 100 రోజులు పూర్తి చేసిన శ్రామికులకు సన్మానం.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.కె.సి.హెచ్.అప్పారావు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.


