ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు.



