విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు


హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి గురించి కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 04, 2026 (బుధవారం) సాయంత్రం 7 గంటల నుండి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ కృష్ణ హోటల్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారట. విజయ్ దేవరకొండ తన పేరు మీద (రష్మిక తరపున కూడా) ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ… తమ కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి విజయ్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన ఫోటోలు బయటకు రావడం, ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్ కూడా లీక్ అవ్వడంతో వీరి పెళ్లి వార్త అధికారికంగా ధృవీకరించబడినట్లయింది.

The post విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *