అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.



