జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్
విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరుగునని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నెంబర్ 9848187636 కు సంప్రదించాలని తెలిపారు.


