వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు


విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట పూర్తిగా నాశనమైంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పీర్ల చావిడి సమీపంలో కరెంటు స్తంభం నేలకొరిగి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తుతో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. ముఖ్యంగా డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే సమయంలో ఈ వాన పడడంతో పంట పూర్తిగా నాశనమైందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, నష్టపరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక మండల కేంద్రంలోని పీర్ల చావిడి సమీపంలో గాలివాన ప్రభావంతో కరెంటు స్తంభం నేలకొరిగి, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *