బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషు
విశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు. శక్తివంతమైన గీతాన్ని మన జాతీయగీతం గా అందించిన వ్యక్తి బంకించంద్రా చటర్జీ అని తెలిపారు. నరనరా నా దేశభక్తిని నింపిన వందేమాతరం గీతములో భారతదేశము యొక్క గొప్పతనం తెలుస్తుంది అని తెలిపారు. బ్రిటిష్ వారి మెడలు వంచినా సమర గోశే వందేమాతరం అని తెలిపారు. ఈ గీతాన్ని 1875 నవంబర్ 7వ తేదీన చటర్జీ రాశారు అని తెలిపారు. అంతేకాకుండా చటర్జీ బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు అని తెలిపారు. ఈ గీతం భారత స్వాతంత్ర సంగ్రామంలో సమర శంఖంగా పనిచేసింది అని తెలిపారు. అందుకే వందేమాతరం గీతమును 150వ వార్షికోత్సవాన్ని దేశ ప్రజలంతా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


