లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం


అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం
బీరుట్: ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్‌పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఇప్ప్పుడు ఇజ్రాయిల్ చేసిన ఒక పని వివాదానికి కారణమయింది. లెబనాన్‌పై దాడుల్లో భాగంగా ప్రజల నివాసాలపై వైట్ ఫాస్ఫరస్ ప్రయోగించినట్లు తేలింది. ఈ నెల 3 న లెబనాన్ పట్టణం యోమోర్‌పై జరిపిన దాడిలో నివాసాలపై వైట్ ఫాస్ఫరస్ చల్లినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. దీని ద్వారా రెండు ఇళ్లు, ఒక కారు మంటల్లో చిక్కుకున్నాయి. అక్కడి ఫైర్ అధికారులు స్పందించి మంటలు ఆర్పేశారు. ఈ వైట్ ఫాస్ఫరస్ చల్లిన తర్వాత చిన్న నిప్ప్పు రవ్వ అంటుకున్నా మొత్తం మంటలు వ్యాపిస్తాయి. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ ఇలాంటి పని చేస్తోందని, దీనివల్ల తమ పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్ప్పు ఉంటుందని లెబనాన్ అధికారులు అంటున్నారు. వీటి ద్వారా ఎవరయినా గాయాలపాలైనా వాటి ప్రభావం చాలాకాలం ఉంటుందని తెలిపారు. వైట్ ఫాస్ఫరస్‌ను బాంబులు, షెల్స్, రాకెట్లు వంటి వాటిలో వాడుతారు. ఈ రసాయన ఆక్సిజన్ రియాక్షన్‌కు గురైనా మంటలు అంటుకుంటాయి. అందుకే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ రసాయనాన్ని వాడటం, పౌరులకు హాని చేయడం నేరం. సైనిక కార్యక్రమాలకే దీనిని వాడాలి.

The post లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *