లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra


కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60) అద్భుత అర్ధశతకాలతో రాణించారు. ఆఖర్లో కెప్టెన్ దసున్ శనక కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. లంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులకే పరిమితమైంది. ఒమన్ జట్టులో మహమ్మద్ నదీమ్ (53 నాటౌట్) ఒక్కడే అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గ్రూప్-బిలో శ్రీలంక అగ్రస్థానానికి చేరింది. ఈ టోర్నీలో లంకకు ఇది వరుసగా రెండో విజ యం. తొలుత ఐర్లాండ్‌పై గెలిచిన లంక, తాజాగా ఒమన్‌పై విక్టరీ కొట్టింది. దీంతో గ్రూప్ బీలో 4 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఇక శ్రీలంక తదుపరి మ్యాచ్‌లు ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 16), జింబాబ్వే (ఫిబ్రవరి 19)తో ఆడాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *