విశాలాంధ్ర గుంతకల్లు.. ప్రధాన రహదారి పై మురికి నీరు పారుతుండడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని15 వార్డులో అంబంబ దేవాలయం ఉన్న ప్రధాన రహదారి పై మురికి కాలువ చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురికి నీరు ప్రధాన రహదారి పై చెరువును తలపించేలా తయారయ్యింది. ఈ మురికి నీరు నిలవడంతో దుర్గంధం వెదజల్లుతూ స్థానికవాసులు, వాహనదారులు ఇబ్బందులు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో గుంతకల్ పట్టణంలో శానిటేషన్ పనులకు నిధులు ఉపయోగించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచామని తెలిపారు. కానీ పట్టణంలోనీ అంబంబ దేవాలయం ప్రాంతంలో మాత్రం మురికి కాలువ లో చెత్తాచెదారంతో నిండిపోయి ఆ రోడ్లపైకి మురికి నీరు ప్రవహిస్తున్నాయి. కానీ శానిటేషన్ కు నిధులు అయితే ఖర్చు చేశామని అంటున్నారే గాని మరి డ్రైనేజీలో చెత్తాచెదారం నిండి మురికి నీరు రోడ్లపైకి రావడంతో మరి నిధులు మంజూరు అయ్యాయా లేదా అని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కావున సంబంధిత మున్సిపల్ అధికారులు కాలువలో చెత్తాచెదారంను తీసి మురికి నీరు రోడ్లపైకి రాకుండా సక్రమంగా పారే విధంగా చేయాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.


