రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..


శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి-2 నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సేవ చేయడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *