రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్


విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం పట్ల వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఈ సేవా కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సుల ద్వారా చేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయని తెలుపుతూ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *