రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి


హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు
విశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటన సోమవారము తెల్లవారుజామున జరిగిందని తెలిపారు. తాత సంఘమప్పతోపాటు మృతుడు కూడా ప్రయాణిస్తున్నాడని తెలిపారు. తదుపరి జారి పడ్డారన్న సమాచారం ప్రయాణికులు తాతకు తెలపడంతో, ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారంతో హిందూపురం డిఆర్పి హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి ధర్మవరం హెడ్ కానిస్టేబుల్ షణ్ముఖనందారెడ్డి, కానిస్టేబుల్ శివయ్య, రమేష్ నాయక్ లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనుకోకుండా ఈ ప్రమాదంలో మనవడు మృతి చెందడం పట్ల తాత తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అక్కడి గ్రామస్తులు తెలుపుతున్నారు. శవ పరీక్ష అనంతరం మృతడేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *