విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరూరు సొసైటీ చైర్మన్ గోనుగుంట్ల గోపాల్, గంగలకుంట రమణ, వైస్ చైర్మన్ కిష్ట, గోపాల్, వాసురెడ్డి, ఓబులేసు, యర్రప్ప, భోగినేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే పరిటాల సునీతకి రైతులు ప్రత్యేక తెలిపారు .


