గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ ఈ పట్టాదారు పాసుపుస్తకాలు రైతులు భద్రపరచుకోవాలని, ప్రభుత్వ పథకాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తదుపరి రైతులందరూ తాసిల్దారుకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోట్లూరు చంద్ర, గోట్లూరు అనిల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆజాద్ బాబు, టిడిపి నాయకులు అమరేంద్ర నారాయణస్వామి, వీఆర్వో విష్ణువర్ధన్, పంచాయతీ కార్యదర్శి గణేష్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


