విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు సంపద అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తుంది, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రైతన్న పశుసంపదను అన్ని రంగాల అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ దేయమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సబ్సిడీ ఎరువులతో పాటు వ్యవసాయ రుణాలు, అన్నదాత సుఖీభవ,పథకాలు, సబ్సిడీతో కూడిన పనిముట్లు అందజేయడం జరుగుతుందన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అర్హత కలిగిన, రైతులు పశుసంపద అభివృద్ధి కొరకు బడ్జెట్లో సైతం భారీ మొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందన్నారు . అనంతరం కల్లుకుంట గ్రామంలో ఉన్నమొత్తం పశువులకు, గొర్రె మేక మందలకు, బర్రెలకు, గర్భ కోశ, వ్యాధులకు చికిత్స, నట్టాల నివారణకు మందులు, గాలికుంట టికాలు,వ్యాధి నివారణ మందులు, పశువులకు వేసి, రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాఘవేంద్ర గారు,పశువైద్య సిబ్బంది, రైతులు, పశుయాజమానులు తదితరులు పాల్గొన్నారు.


