రైతులకు అండగా కూటమి ప్రభుత్వం


విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, సర్పంచ్ శివ, యువ నాయకులు చంద్రశేఖర్, కందనాతి మహాదేవ, రైతులు పాల్గొన్నారు.

The post రైతులకు అండగా కూటమి ప్రభుత్వం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *