రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు


విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత విజయం మా పాఠశాలకు గర్వకారణం” అనితెలిపారు. సీఏఓ రవీంద్ర మాట్లాడుతూ, ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది” అని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడుతూ, క్రమశిక్షణ , పట్టుదల వల్లే ఈ స్థాయి సాధ్యమైంది” అని అభినందించారు. ఏఓ రంగారెడ్డి ఉపాధ్యాయులు మోక్షిత ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *