రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ మొబైల్ వినియోగంపై నియంత్రణ అవసరాన్ని వివరించారు. సీఏఓ రవీంద్ర ఆత్మనిగ్రహం, సమయపాలన ప్రాముఖ్యతను తెలియజేశారు.
వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఏఓ రంగారెడ్డి , ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తల్లిదండ్రుల సహకారం ముఖ్యపాత్ర పోషించింది అని, తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

The post రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *