రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం


జిల్లా కోఆర్డినేటర్ రమేష్
విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.
“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్ సేవలు అందిస్తున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కట్టుబాటును ప్రదర్శించారు.
ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప్ సింగ్ విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ. రంగారెడ్డి వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *