రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక


ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

పలు జిల్లాల్లో చినుకులు కురిసే సూచనలు
ఇక శనివారం ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో చినుకులు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *