అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
The post రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం.. appeared first on Visalaandhra.


