రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra


రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ ఆకాంక్షించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ మురవణి గ్రామం నుంచి బస్టాండ్ ఆవరణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నతుంబళం సొసైటీ అధ్యక్షులు కందనాతి నరసప్ప, టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి మునెప్ప, కార్యదర్శి ఈరన్న, సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యన్న గౌడ్, హెచ్ మురవణి గ్రామ అధ్యక్షులు సొంటెన్న, జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, నాయకులు బిపి ఈరన్న, సంజీవయ్య, నరసింహులు, రాఘవరెడ్డి, దుమ్మల శివ, మధు,చంద్ర, ఏక్ హనుమంతు, శాంతప్ప, సత్యన్న, వెంకటేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *