రఘురామకృష్ణమ రాజు – సునీల్ కుమార్ మధ్య వాగ్యుద్ధం


సామాజిక మాధ్యమాల ద్వారా వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సామాజిక, ప్రసారమాధ్యమాల వేదికగా వాగ్ధానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ రాజు క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అయింది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం ఆటలో పడి పోతేనే రెండు ఎముకలు విరిగే వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు ఇరిగేవి అధ్యక్ష అంటూ వ్యంగంగా ప్రకటన చేశారు. దీనిపై రఘురామరాజు ఘాటుగా స్పందించారు. సర్వీస్ కాల సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్ ఒప్పుకుంటే అరగంట చాలు కస్టడీలో నన్ను కొట్టినట్లుగా ఎముకలు విరగకుండా కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర రబ్బరు బెల్టుతో రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను. సునీల్ కుమార్ వచ్చి నిరూపించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెడతా అంటూ ఒక ప్రకటనలో సవాల్ చేశారు. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందని, నాపై కస్టోడియల్ హింసకు పాల్పడిన సునీల్ కుమార్ అరెస్ట్ పద్యం అని ఆయన హెచ్చరించారు. వెంటనే సునీల్ కుమార్ స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ సెల్ఫ్ గోల్డ్ అంటూ ఒక వీడియో సందేశాన్ని ఫేస్ బుక్ లో పెట్టారు.

The post రఘురామకృష్ణమ రాజు – సునీల్ కుమార్ మధ్య వాగ్యుద్ధం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *