Last Updated:
రంజాన్ మాసంలో అత్తర్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఆర్మన్ అత్తర్స్ షేఖ్ యాశిక్ ప్రకారం, ప్రత్యేక ఆఫర్లు, విభిన్న సువాసనలతో మార్కెట్ పరిమళాలతో నిండిపోయింది.
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని అత్తర్ దుకాణాలు మళ్లీ సువాసనలతో కళకళలాడుతున్నాయి. పండుగల సీజన్‌లో ఎప్పుడూ గిరాకీ ఉండే అత్తర్లకు, రంజాన్ సమయంలో మాత్రం ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ముస్లింలు అత్తరు కొట్టకుండా బయటకు వెళ్లరు అన్న మాట నిజమని ఈ రోజుల్లో మార్కెట్ పరిస్థితులు చెబుతున్నాయి. చిన్నవారు నుంచి పెద్దల వరకు అందరూ తమకు నచ్చిన సువాసనను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తున్నారు.
జగదాంబ ప్రాంతంలోని ఆర్మన్ అత్తర్స్ నిర్వాహకుడు షేఖ్ యాశిక్ మాట్లాడుతూ, రంజాన్ ప్రారంభం నుంచే అత్తర్లకు గిరాకీ పెరిగిందన్నారు. ఈ నెల రోజుల పాటు ముస్లిం సోదరులు అధికంగా కొనుగోలు చేస్తారని, సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు వ్యాపారం జరుగుతుందని తెలిపారు. తమ వద్ద రూ.100 నుంచి రూ.80 వేల వరకు అత్తర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించామని తెలిపారు. 100 ml అత్తరు ధర రూ.800 ఉండగా, ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దీంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున షాపుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం Lavender Oudh 100 ml రూ.1600, లీటర్ రూ.80 వేల వరకు ధర ఉందని, Purple Oud 100 ml రూ.800, Sauvage 100 ml రూ.1200, Hasai Hawas 100 ml రూ.1200, Vampire Blood, Jaguar Black, Blueberry Black వంటి ప్రీమియం సువాసనలు కూడా రూ.1200 ప్రాంతంలోనే అందిస్తున్నామని వివరించారు. పండుగ వాతావరణంలో ప్రత్యేక సువాసనలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని తెలిపారు.
అత్తర్ తయారీ విధానంపై మాట్లాడితే, గులాబీ రేకులు, మొగలి పువ్వులు, గంధపు చెక్కలు వంటి సహజ పదార్థాలతో ప్రత్యేకంగా తయారు చేస్తామని చెప్పారు. కస్టమర్ కోరుకున్న సువాసనను కస్టమైజ్ చేసి అందిస్తామని తెలిపారు. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తయారు చేయించుకుని కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
రంజాన్ అంటే కేవలం ఉపవాసాలు మాత్రమే కాదు, పవిత్రత, శుభ్రత, సువాసనలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం కూడా. అందుకే ఈ నెలలో అత్తర్లకు ఉండే ప్రత్యేక గిరాకీ ప్రతి ఏడాది మరింత పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా ఆఫర్లతో పాటు విభిన్న రకాల సువాసనలు అందుబాటులో ఉండడంతో మార్కెట్ మొత్తం అత్తర్ల పరిమళాలతో నిండిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Feb 20, 2026 10:55 PM IST


