యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం – Visalaandhra


. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం
. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం
. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రకటన

న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో ముఖ్యంగా ఆర్థిక, భద్రత, మానవతా కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. భారత్‌కు అవసరమైన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)లో సింహ భాగం పశ్చిమా సియా దేశాల నుంచే వస్తుందని ప్రధాని గుర్తు చేశారు. ఆ ప్రాంతం ఇతర దేశాలతో వాణిజ్యానికి కీలక మార్గంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. అందువల్ల అక్కడి పరిస్థి తులు దిగుమతులు, ఎగుమతులు, సముద్ర మార్గ రవాణాపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. హోర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు భారీ స్థాయిలో చమురు, గ్యాస్, ఎరువులు వంటి కీలక వస్తువులు రవాణా అవుతున్నాయని తెలిపారు. అయితే యుద్ధ పరిస్థితుల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు కష్టతరంగా మారినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చూసిందని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ఎల్‌పీజీ వినియోగం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. సుమారు 60 శాతం ఎల్‌పీజీ అవసరాలు దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నా యని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వినియోగదారులకు ప్రాధా న్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నా మని, అంతేకాకుండా దేశీయ ఉత్పత్తిని కూడా పెంచుతున్నా మని వెల్లడించారు. పశ్చిమాసియాలో దాదాపు ఒక కోటి మంది భారతీ యులు నివసిస్తూ.. అక్కడ పనిచేస్తు న్నారని ప్రధాని గుర్తు చేశారు. అలాగే వాణిజ్య నౌకల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై భారత్‌కు సహజంగానే ఎక్కువ ఆందోళన ఉంటుందన్నారు. యుద్ధం ప్రారంభ మైనప్పటి నుంచి అక్కడ ఉన్న భారతీ యుల భద్రతను అత్యంత ప్రాధా న్యంగా తీసుకుంటున్నామని మోదీ తెలిపారు. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల అధినేతలతో రెండు దఫాలుగా మాట్లాడినట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు వారు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. ఇరాన్ నుంచే దాదాపు వెయ్యి మంది తిరిగి వచ్చినట్లు చెప్పారు. అందులో 700 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని మరణాలు, గాయాలు సంభవించా యని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయు లకు 24 గంటల హెల్ప్‌లైన్లు, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశాల్లో సీబీఎసఈ 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. విద్యలో అంతరా యం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించిందని ప్రధాని వివరించారు. దేశంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను గణనీయంగా పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్ వద్ద 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని, వాటిని 6.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదేవిధంగా గతంలో 27 దేశాల నుంచి మాత్రమే ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోందని మోదీ చెప్పారు. ఇది సరఫరా భద్రతను పెంచేందుకు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న క్లిష్ట పరిస్థి తులు దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరిం చారు. కాబట్టి దేశం ఐక్యంగా ఉండి ఈ సవాళ్లను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చూపిన ఐక్యతను మరోసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. “భారతదేశంలో భవిష్యత్తులో తలెత్తే చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొత్త దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాం. దీనికి ఇథనాల్ వంటివి తోడవ్వడం, రైల్వేల విద్యుదీకరణ, ఈవీలు, ప్రత్యామ్నాయ ఇంధనంపై చేసే కృషి సురక్షితమైన భవిష్యత్తును అందిస్తాయి. ప్రస్తుతం మనకు లభించే శక్తిలో సగం పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. కొత్త వనరుల నుంచి 250 గిగావాట్ల విద్యుత్ వస్తోంది. 40 లక్షల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. అణుశక్తి ఉత్పత్తిని ప్రోత్స హించడం ద్వార ఐదేళ్లలో 1500 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం పెరిగింది” అని మోదీ పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *