యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్


ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల వార్ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం గలది. అత్యధిక ఎత్తులో కూడా సమర్థంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొడుతుంది. అందుకే దీన్ని డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు. కెనడాలోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎసఐఎస్) సమాచారం ప్రకారం.. ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని బరువు 23,600 కిలోలు. ఈ క్షిపణుల రూపకల్పనను ఇరాన్ 1990లో ప్రారంభించింది. మొదటిసారిగా దీన్ని 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. దాంతో మెరుగైన నావిగేషన్ వ్యవస్థలను రూపొందించి 2009లో రెండోసారి ఈ క్షిపణిని పరీక్షించారు. అప్పటి నుంచి ఆ తర్వాత కూడా అనేకసార్లు పరీక్షలు జరిపారు. ఆరోసారి ప్రయోగం చేసే సమయంలో ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు భావిస్తున్నారు.

The post యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *