యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి


సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు గోడౌన్ లో స్టాక్ ఉంచుకొని మార్కెట్లో కొరత సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అని తెలిపారు..పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది అని తెలిపారు.. ధర్మవరంలో స్థానికంగా ఎక్కువ చేనేత కార్మికులు ఉండడంతో రేషం,వార్పు, ధరలు పెరగడంతో గిట్టుబాటు ధరలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. ఇలాంటి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు, మరియు గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ధరలు పెంచుతున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, చెన్నంపల్లి శ్రీనివాసులు, మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ, ప్లంబర్స్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మీనారాయణ,మసూద్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *