ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ
జెరూసలేం: అమెరికాతో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికిగాను తమ దేశం వారానికి మూడు బిలియన్ డాలర్ల వ్యయ భారాన్ని భరించాలని ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లప్పర్‌కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలన్ రోమ్ లేఖ రాశారు. ఆర్థికపరమైన ఆంక్షలను క్రమంగా సడలించాలని కోరారు. వ్యాపారాలు, పని ప్రదేశాలు ప్రారంభం కావాలన్నారు. భద్రతా పరిస్థితి కోసం రక్షణ విధానం అక్కర్లేనప్పటికీ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే నష్టాల” తప్పవని ఇలన్ రోమ్ హెచ్చరించారు. భద్రతావసరాలతో పాటు ఆర్థిక అవసరాలను తీర్చేలా పరిష్కారం ఎంతో అవశ్యమని చెప్పారు. యుద్ధాలు, భద్రతా అవసరాల దష్ట్యా గడిచిన రెండున్నరేళ్లలో ఖర్చు అమాంతరం పెరిగిందని, దీనిని పరిష్కరించడం అవసరమని సూంచించారు. ప్రస్తుతం ఆంక్షల క్రమంలో ఆర్థిక వ్యవస్థ నష్టాలను చవిచూస్తున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థలు మూసివేయడం, పని నిషేధం విధించడం, రిజర్వు సైనికులను తరలించడం వంటివి వారానికి ఎనఐఎస్ 9.4 బిలియన్ల నష్టం తెస్తున్నట్లు వెల్లడించారు.


