శ్రేయాస్‌కు బీసీసీఐ షాక్
ముల్లాన్‌పూర్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ Âతొలిమ్యాచ్‌లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ‘స్లో ఓవర్ రేట’ నిబంధనను ఉల్లంఘించినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల (1.2 మిలియన్లు) జరిమానా విధించినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. ఇది మొదటి తప్పు కావడంతో కేవలం ఫైన్‌తో సరిపెట్టారు, ఇది పునరావతమైతే కెప్టెన్‌పై నిషేధం పడే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ ఆటగాడు కూపర్ కనోలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ వ్యక్తిగతంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. బ్యాటింగ్‌లో కేవలం 18 పరుగులకే వెనుదిరగడమే కాకుండా, చేతికి గాయం కావడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు భారీ జరిమానా పడటంతో అయ్యర్ అభిమానులు డబుల్ షాక్‌కు గురయ్యారు.
అయ్యర్ చేతికి గాయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేతికి గాయమైంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతిని స్ట్రైకర్లోని కూపర్ కనోలీ కొట్టాడు. అది నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైకర్ శ్రేయస్ అయ్యర్ చేతికి బలంగా తాకింది. దీంతో స్టేడియంలోని పంజాబ్ అభిమానులు కలవరానికి గురయ్యారు. బాధతో విలవిలాడిన శ్రేయస్ ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అయినా సరే, బాధతో ఇబ్బందిపడుతూనే బ్యాటింగ్ కొనసాగించేందుకు ప్రయత్నించాడు. అయితే, 18 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. కనోలీ కీలక ఇన్నింగ్స్‌తో పంజాబ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తన గాయంపై శ్రేయస్ స్పందించాడు. “తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం బాగుంది. బంతి బలంగా తాకడంతో బాగా నొప్పి వచ్చింది. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. గెలిచిన ఉత్సాహంలో ఉన్నప్పుడు అపశకునం మాటలు మాట్లాడకూడదు. నేనెప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉంటా. ప్రతీది మన మంచికేనని ఆశిస్తా. కనోలీ ఆటను ఎదురుగా ఉండి చూడటం బాగుంది. నాణ్యమైన షాట్లు కొట్టాడు.
స్పల్ప వ్యవధిలో వికెట్లు పడినా కనోలీ మాత్రం చివరివరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం అభినందనీయం. త్వరగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని కాస్త టెన్షన్‌కు గురిచేసింది. నేను పెవిలియన్‌కు చేరిన తర్వాత నా చేతి గురించి ఆలోచిస్తూ ఉండిపోయా. దానికి ఐస్ పెడుతూ కాస్త సపర్యలు చేశా. ఈలోగా రెండు వికెట్లు టపటపా పడ్డాయి. ఐపీఎల్లో ఇలాంటి పరిస్థితులు కొత్తేం కాదు. వాటిని అధిగమించి కూపర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు” అని అయ్యర్ తెలిపాడు.


