దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.
బాగానే ఉన్నా: నెతన్యాహు
తన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెక్ పెట్టారు. ఆదివారం జెరూసలెంలోని మినీ మార్కెట్‌వద్ద కాఫీ ఆర్డర్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన విడుదల చేశారు. గత వారం రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఆరు వేళ్లతో ఆయన ఉన్నట్లుగా ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన ఉనికిపై ప్రత్యర్థులు అనుమానాలను ప్రచారం చేశారు. నెతన్యాహు డూప్‌ను పెట్టారని సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ‘అవును నేను కాఫీ కోసం చచ్చిపోతున్నా’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ‘మీకు తెలుసా.. నేను ఇజ్రాయెల్ ప్రజలంటే పడి చచ్చిపోతా. వారు అద్భుతంగా వ్యవహరిస్తున్నారు. మీరు నా చేతివేళ్లను లెక్కించాలనుకుంటున్నారు. ఇదిగో చూడండి. చూశారు కదా’ అని స్పష్టం చేశారు. మరో వైపు నెతన్యాహును ఎలాగైనా అంతమొందిస్తామని ఐఆర్జీసీ శపథం చేసింది.
The post మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్ appeared first on Visalaandhra.


