మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌


పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.
వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇటీవల వరుసగా ఇరాన్‌ను ఒప్పందానికి రావాలని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్..ఈసారి తన స్వరాన్ని మార్చారు. సైనిక చర్య ముగింపు ఇరాన్‌తో ఒప్పందంపై ఆధారపడదని స్పష్టం చేశారు.

వారు ఒప్పందం చేసుకున్నా, చేయకపోయినా అది ఇప్పుడు పెద్ద విషయం కాదు అని వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిందనే నమ్మకం వచ్చిన తర్వాతే అమెరికా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన దాడుల ప్రభావం ఇరాన్‌పై తీవ్రంగా పడిందని ట్రంప్ చెప్పారు. ఆ దేశం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేశారు. సైనిక శక్తి పూర్తిగా దెబ్బతిందని.. సరైన నాయకత్వం కూడా లేదని విమర్శించారు. ఁవారు చర్చలకు వస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. రాకపోయినా మాకు పెద్దగా సమస్య లేదుఁ అని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా విదేశాంగ శాఖ స్పందన
తమ ఆపరేషన్ లక్ష్యం ఇప్పటికే సాధించామని.. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని కూడా అన్నారు.
ఇక గ్యాస్ ధరల పెరుగుదలపై స్పందిస్తూ.. ఇరాన్‌లో సైనిక చర్య ముగిస్తే ధరలు తగ్గుతాయి. మేము త్వరలోనే ఆ దిశగా అడుగులు వేస్తాం అని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్ యుద్ధం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే ముగిసే అవకాశముందని తెలిపారు. బుధవారం రాత్రి (అమెరికా సమయానుసారం) శ్వేత సౌధం నుంచి ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రసంగంలో ఇరాన్‌పై మరింత కీలక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.

The post మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *