మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..


విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *