గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ అవార్డులను శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పుష్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. దివంగత ప్రజాయకుడు గద్దర్ పేరుతో చలనచిత్ర పురస్కారాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 నుంచి 2023 వరకు వచ్చిన చిత్రాలకు, అలాగే 2024 -25 సంవత్సరాల్లో వచ్చిన చిత్రాలుకుగాను ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.
మెగాస్టార్ చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ చిత్రంతో తెరంగేట్రం చేసి, ఇప్పటివరకు 150 కి పైగా చిత్రాల్లో (అతిథి పాత్రలతో కలిపి) ప్రధాన పాత్రలో నటించారు. సినీ జీవితంలో ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. తన కరీర్ లో ‘ఖైదీ’ సినిమా మొదటిగా సూపర్ హిట్ కొట్టింది. అనంతరం చాలెంజ్, ఘరానా మొగుడు, స్వయంకృషి, ఇంద్ర, ఠాగూర్, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఆయన 1506వ చిత్రంగా ‘విశ్వంభర’ లో నడుస్తున్నారు.


