హైదరాబాద్: హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ‘మృత్యుంజయ’ చిత్రం ఈనెల27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… చిత్ర బందం టీజర్‌ను విడుదల చేసింది ఈ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పోలీస్ అధికారిగా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో, శ్రీవిష్ణు సరసన ‘సామజవరగమన’ ఫేమ్ రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవగా, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


