మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం జరుగుతుందన్నారు, క్రీడారంగంలో నైపుణ్యం పొందే విధంగా బోధన ఉంటుందని వారు తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఉత్తమ బోధన ఉంటుందని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *