మా జోలికి రావొద్దు… బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్


అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడి చేసేందుకు అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఇరాన్ శనివారం తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే, ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఃఎక్స్ః వేదికగా ఓ పోస్ట్ చేశారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న ఈ యుద్ధంలో భాగం కావాలని బ్రిటన్ ప్రజల్లో అధిక శాతం మంది కోరుకోవడం లేదు. కానీ, వారి ప్రధాని స్టార్మర్ మాత్రం సొంత ప్రజల అభిప్రాయాన్ని విస్మరించి, ఇరాన్‌పై దాడికి యూకే స్థావరాలను వాడేందుకు అనుమతిస్తున్నారు. తద్వారా ఆయన బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడానికి ఇరాన్ వెనుకాడదుఁ అని అరాఘ్చీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వివాదం తమది కాకపోయినా, బ్రిటన్ అనవసరంగా తలదూరుస్తోందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.ఈ అంశంపై ఇరాన్ తన ఆందోళనను అధికారికంగా కూడా బ్రిటన్‌కు తెలియజేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ, బ్రిటన్ హోం మంత్రి యెవెట్ కూపర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అమెరికాకు సైనిక స్థావరాలను అందుబాటులో ఉంచడాన్ని తమపై జరుగుతున్న దురాక్రమణలో పాలుపంచుకోవడంగానేఁ పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఇరాన్ హెచ్చరికలకు బ్రిటన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. అరాఘ్చీతో జరిగిన ఫోన్ సంభాషణలోనే హోం మంత్రి యెవెట్ కూపర్ తమ వైఖరిని స్పష్టం చేశారు. బ్రిటన్ స్థావరాలు, భూభాగం, లేదా ఇతర ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవద్దనిఁ ఆమె ఇరాన్‌ను హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆమె తేల్చిచెప్పారు. ఈ పరస్పర హెచ్చరికలతో ఇరాన్, బ్రిటన్ మధ్య దౌత్యపరమైన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *