మామిడి తోట నుంచి మార్కెట్ ఆశీలు వరకు.. సాగర నగరంలో వరుస బహిరంగ వేలాలు..! Visakhapatnam Jail mango orchard Bheemili. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం కేంద్ర కారాగార మామిడి తోట పంట వేలం, భీమిలి జోన్ రోడ్డు మార్జిన్లు మార్కెట్ల ఆశీలు హక్కుల వేలం వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

News18
News18

విశాఖపట్నంలో ఒకే సమయంలో రెండు బహిరంగ వేలాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేంద్ర కారాగారంలో ఉన్న మామిడి తోట పంటకు ఒకవైపు వేలం నిర్వహించగా, మరోవైపు భీమిలి జోన్‌లో రోడ్లు, మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కుల కోసం బహిరంగ వేలం చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆదేశాల మేరకు విశాఖపట్నంలోని కేంద్ర కారాగార ప్రాంగణంలో ఉన్న మామిడి తోట పంటను బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్‌కు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 8, 2026న ఉదయం 10 గంటలకు జైలు పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేలం జరగనుంది. వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.1000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. గెలుపొందిన వారు వెంటనే పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండగా, లేకపోతే డిపాజిట్ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. ఈ వేలం ప్రక్రియను జైళ్ల ఉప శాఖాధికారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ఇక మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని భీమిలి జోన్‌లో కూడా మరో బహిరంగ వేలం జరగనుంది. మార్చి 26, 2026న ఉదయం 11 గంటలకు ఈ వేలం నిర్వహించనున్నారు. రోడ్డు మార్జిన్లు, మార్కెట్లలో రోజువారి ఆశీలు వసూలు చేసుకునే హక్కులను సంవత్సర కాలానికి కాంట్రాక్ట్‌గా ఇవ్వనున్నారు. భీమునిపట్నం రోడ్డు మార్జిన్‌తో పాటు లాల్ బహుదూర్ శాస్త్రి మార్కెట్, కలిగొట్ల సూర్యనారాయణ మార్కెట్ ప్రాంతాలు ఈ వేలంలో ఉన్నాయి. అలాగే తగరపువలస, చిట్టివలస ప్రాంతాల్లోని రోడ్డు మార్జిన్లకు కూడా ఈ వేలం వర్తిస్తుంది.

వేలంలో పాల్గొనదలచిన వ్యక్తులు, సంస్థలు భీమునిపట్నం జోనల్ కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ రెండు వేలాలు వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జైలు ప్రాంగణంలోని మామిడి తోట వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *