పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి అయిన తర్వాత తన పేరును అతీజాగా మార్చుకొన్నారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇటీవల తన నలుగురు పిల్లలతో కలిసి బయటకు వచ్చి హిందూమతంలోకి మారారు. తన పేరును కూడా ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వారు కిడ్నాప్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం appeared first on Visalaandhra.


