మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు – Visalaandhra


ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. మీడియా, అసెంబ్లీ సిబ్బంది, సాధారణ జనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సైబర్ సెల్ అధికారులు ఆ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై దృష్టి సారించారు. ఫోరెన్సిక్ నిపుణులు డిజిటిల్ ఫుట్ ఫ్రింట్స్ కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్రం హోంమంత్రి పంకజ్ మాట్లాడుతూ ‘గురువారం ఉదయం 6.27 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విధాన్ భవన్‌తో పాటు బాంబే స్టాక్ ఎక్సైంజ్, హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో ఆ మెయిల్ ఫేక్ అని తేలింది. అధికారులు మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *