సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం నందు సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తో పాటు, చేతివృత్తుదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాటమయ్య నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరు కావడం జరిగింది అని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 వ తేది నుండి 12 వ తేదీ వరకు అనంతపురం నుండి వయా బత్తలపల్లి బండ్లపల్లి వరకు సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ , రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు ప్రజా సంఘాలు పాల్గొంటారు అని తెలిపారు. కావున ఈ కార్యక్రమమును విజయవంతం చేయాలని వారు తెలిపారు.


